Tumgik
#జమ్మి చెట్టు
chaitanyavijnanam · 7 months
Text
శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం / Inner Meaning of Shami Vriksha Puja - Paramarth
Tumblr media
🌹. శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం / Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న శమీవృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి, నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని అపరాజితా దేవిని (దుర్గాదేవిని) ప్రార్థించారు. అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని బయలుదేరిన రోజు ‘విజయదశమి’. సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా విజయదశమి నాడు శమీవృక్షాన్ని దర్శించి, పూజిస్తారు.
శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. పాండవులు శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
ఇంటికి వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందు కోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక. మీరు కూడా ఈరోజు సాయంత్రం శమీపూజ చేసి అపరాజితా దేవి అనుగ్రహాన్ని పొందండి.
శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌ శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్‌
అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని లేదా శమీ వృక్ష పార్ధనా స్తోత్రం శమీ వృక్షం వద్ద పఠించాలి.
🌴. శమీ వృక్ష ప్రార్థనా స్తోత్రం 🌴
శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని ॥
శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం ॥
నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ ॥
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ ॥
అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం దుస్స్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం ॥
🪷. మంత్రార్థం 🪷
శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.
🍀. శమీ వృక్ష పార్థనకు సాధనాపర విశిష్టత 🍀
పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింప చేసేది లేదా నిగ్రహింప చేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధి ప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి.
విజయదశమిని దశహరా అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది . పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమి నాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైన ‘శమీ వృక్షా’న్ని దుష్ట ఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.
శమీ వృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతం. అందరికి మంచి బుద్ధి కలిగి తద్వారా లోకకళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం.
🌹 🌹 🌹🌹 🌹
🌹. Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹 📚. Prasad Bharadwaja
In the Mahabharata, the Pandavas came to outskirts of the city of Virata in anonymity, put their weapons on the sami tree and prayed to Aparajita Devi (Durga Devi) that their weapons on the Sami tree may appear as snakes and demons to enemies, as flower garlands to friends, as weapons to themselves. 'Vijayadasami' was the day when Arjuna took his weapons and set out during the northern eclipse after their agnyatavasa ends. Usually the Sami tree is far away from the village. Even today, following that custom, the Sami Vriksha is visited and worshiped on Vijayadashami.
Sami tree means 'jammi tree'. Pandavas got the blessings of 'Aparajita' Goddess in the form of Shami Vriksha and achieved victory over the Kauravas. 'Sri Rama' worshiped this 'Aparajita' Devi on this Vijayadashami day and killed Ravana and got victory. Aswayuja Shuklapadyam was the time when Lord Rama awakened his power. On the tenth day from that day, Lord Rama got complete victory and left on Pushpakam to Ayodhya. Before leaving, he worshiped the Sami tree. That is why it has become customary to celebrate Navratri and do Shami Puja on Vijayadashami.
On the evening of Vijayadashami, at the time of Nakshatra Darshan Vijaya,one should worship Aparajita Devi at the Samivriksha (Jammi tree) and perform pradakshans to the tree while reciting the above verse. The slips with the above verse written on them should be stuck to the branches of that tree. By doing this, it is believed that apart from Mother's Grace, Shanidosha will also be cured.
When they come home they bring jammi leaf with them. It is customary for the younger ones to put the jammi leaf in the hands of the elders, calling it 'gold' and getting their blessings. Gold symbolizes Goddess Lakshmi. May you also perform Shami Puja today evening and get the grace of Goddess Aparajita.
Sami Shamayate Papam Sami Nasayate Ripoon Sami Vittancha Putrancha Sami Ditsati Sampadam
This Padma Purana Shloka or Shami Vriksha Pardhana Stotra should be recited at the Shami Vriksha.
🌴. Shami Vriksha Prayer Hymn 🌴
Sami Shamaya Te Papam Sami Shatru Vanashini Arjunasya Dhanurdhari Ramasya Priyadarshini ॥
Shamim Kamalapatrakshim Shamim Kantakadharineem Arohatu Shamim Lakshmim Nrinamayushyavardhanim ॥
Namo Vishwasvrakshaya Parthasastradharine Tvattah Patra Pratikshyami Sada Me Vijayi Bhava ॥
Dharmatma satyasandhascha Ramo Dasarathiryadi Paurushe chaఽpratidvandvascharainam jahiravanim ॥
Amangalanam Prasamim Dushkritasya Cha Nashinim Dussavapnaharineem Dhanyam Prapadyeham Samim Shubham ॥
🪷. Mantra 🪷
The Sami tree is a savior from sin. Destroys enemies. At a time, it had held Arjuna's bow. Pleased Sri Rama. Convenience to pilgrims. Keeps all the work running smoothly.
🍀. Specialty of Sami Vriksha Parthana in sadhana🍀
Pancha Pandavas i.e. the five sense organs of the body, should place their weapons i.e. the instincts or the actions of the senses on the Sami Vriksha. 'Shami' means one who calms or restrains. Any movement of any small part of our body should be done by mind. So 'Shami' means Buddhi, all weapons are found in Buddhi. The real weapons of 'buddhi' are 'thoughts'. These weapons appear to the enemy as snakes and demons. In other words, our thoughts become snakes and frighten like demons in the case of enemies but become garlands for loved ones. Our Buddhi is Gnanalakshmi. Therefore we call Amma Gnanaprasunambika, Vidyalakshmi, Gnanalakshmi, Mokshalakshmi. In another interpretation, 'Shami' means Goddess Lakshmi. Buddhi is mother, so if you follow mother's mind, you will achieve all success.
Vijayadasami is called Dashahara which means removing ten sins. Since it is the Buddhi who removes the ten sins of the ten senses and commits the sins of the senses, one should pray to that mother to bestow a good mind and on Vijayadashami, one should worship the famous 'Sami Vriksha' among the deity trees to drive away all evil thoughts, greed and evil mind.
Shami tree is a symbol of Lakshminarayan. The implication of Shami Puja is that everyone should have a good mind so that the welfare of the world can take place.
🌹 🌹 🌹🌹 🌹
0 notes
telangananz · 2 years
Photo
Tumblr media
మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. విజయదశమి (Happy Dussehra) రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. అందరికీ "దసరా పండుగ శుభాకాంక్షలు " https://www.instagram.com/p/CjTP43wvYmh/?igshid=NGJjMDIxMWI=
0 notes
telanganajournalist · 3 years
Text
ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Tumblr media
చెడుపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని దసరా పండుగను జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకాంక్షించారు.
Tumblr media
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబసభ్యులతో ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకోవాలని, అందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కలెక్టర్.
0 notes
bethalasr7 · 5 years
Text
నాటవలసిన వృక్షం నక్షత్రం
#నక్షత్రము - #నాటాల్సిన వృక్షం
వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చేయాలో ఈ శాస్త్రములో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.
నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి.
జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు - ఫలితాలు
అశ్వని నక్షత్రము
అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.
భరణి నక్షత్రము
భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది
కృత్తిక నక్షత్రము
కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.
రోహిణి నక్షత్రము
రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
మృగశిర నక్షత్రము
మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
ఆరుద్ర నక్షత్రము
ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.
పునర్వసు నక్షత్రము
పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉ��డదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.
పుష్యమి నక్షత్రము
పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.
ఆశ్లేష నక్షత్రము
ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.
మఖ నక్షత్రము
మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి
పుబ్బ నక్షత్రము
పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తర నక్షత్రము
ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
హస్త నక్షత్రము
హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.
చిత్త నక్షత్రము
చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.
స్వాతి నక్షత్రము
స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
విశాఖ నక్షత్రము
విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.
అనురాధ నక్షత్రము
అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.
జ్యేష్ఠ నక్షత్రము
జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.
మూల నక్షత్రము
మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.
పూర్వాషాడ నక్షత్రము
పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ ��ేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఉత్తరాషాడ నక్షత్రము
ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.
శ్రవణం నక్షత్రము
శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.
ధనిష్ఠ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
శతభిషం నక్షత్రము
శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మ���కాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
పూర్వాభాద్ర నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.
రేవతి నక్షత్రము
రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.
1 note · View note
venkatreddy-gotike · 3 years
Photo
Tumblr media
ఊరుఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు.. విశిష్టమైన చెట్లను పెంచుదాం.. భవిష్యత్ తరాలను కాపాడుకుందాం.. శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! హైదరాబాద్, సెప్టెంబర్ 16: దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా .. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని సంతోష్ కుమార్ తీసుకున్నారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని బేగంపేటలో జరిగిన పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఎం.పీ ప్రకటించారు. ఇప్పటికే ఇరవై వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్దం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమంలాగానే దీనిని కూడా విస్తృతంగా ప్రాచారం చేయటంతో పాటు, ప్రతీ ఊరిలో-ప్రతీ గుడిలో జమ్మి వృక్షం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత తరానికి జమ్మి చెట్లు అంటే కేవలం దసరా రోజు మాత్రమే గుర్తుకు వస్తుందని, పురాణ కాలం నుంచి మన చరిత్రలో జమ్మికి ప్రాధాన్యత ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వేదకాలం నుంచీ నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో గుడిలో బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎం.పీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. తమవంతుగా https://www.instagram.com/p/CT4AbMaPBfH/?utm_medium=tumblr
0 notes
somasarva · 3 years
Photo
Tumblr media
హోరాసర్వం Astro News Letter తేదీ: 7.8.2021,శనివారం గ్రహ గతులు : 1.ఆగస్ట్ 7 -10 బుధుడి గండాంత సంచారం 2.ఆగస్ట్ 8 - అమావస్య 3. ఆగస్ట్ 9 - శ్రావణ మాసం ఆరంభం 4.ఆగస్ట్ 11 నుండీ సెప్టెంబర్ 6 వరకు - శుక్రుడు తన నీచరాశి సంచారం 5.ఆగస్ట్ 14 నుండీ 20 వరకు - రవి గండాంత సంచారం 6.ఆగస్ట్ 11 కేతువుపై కుజుడి పూర్ణ దృష్టి 7. ఆగస్ట్ 22 - కుంభ రాశి లో పౌర్ణమి - శ్రావణ పౌర్ణమి ( జంధ్యాల పౌర్ణమి) ఈ రోజు తిధి,నక్షత్రం : ఆషాఢ కృష్ణ చతుర్దశి సా 7.11 వరకు. తరువాత అమావస్య. ఉ 8.16 వరకు పునర్వసు తరువాత పుష్యమి. ఆశ్లేషా,జ్యేష్టా,రెవతీ వారికి రోజంతా తారా బలం బావుంది. ఈ రోజు చంద్ర రాశి : కర్కాటక రాశి.వృషభం,కర్కాటకం,కన్యా,తుల,మకరం,కుంభం వారికి చంద్ర బలం బావుంది. ఈ రోజు పూజ : శనివారం పైగా పుష్యమీ నక్షత్రం కాబట్టి శనైశ్చర పూజ విశేషం గా చేసుకోవాల్సిన రోజు. 1.మన్యు సూక్త పారాయణ మంచిది. 2.నల మహారాజు చరిత్ర కానీ సుందరాకాండ పారాయణ చేసుకోవాలి ఈ రోజు శనైశ్చరుడికి ప్రత్యేక పరిహారం: జమ్మి చెట్టు కి 19 ప్రదక్షిణలు చేసి చెట్టు మొదట్లో దీపారాధన చెయ్యాలి. ఈ రోజు మంత్రం: 1.గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహాముని: శనైశ్చర కృతాం పీడాం నాశయంతి స్మృతాస్త్రయ: 2.కాశ్యపాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహీ తన్నో మందః ప్రచోదయాత్ https://www.instagram.com/p/CSQmAx9BFeMxVeniYYnhK9az95MwM6brSyi9yU0/?utm_medium=tumblr
0 notes
abagym · 7 years
Photo
Tumblr media
ఫేస్ బుక్ మిత్రులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండగ సందర్భంగా ఆ దుర్గ మాత అమ్మవారిని దర్శించుకుని ఆ తరువాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి కానీ, ఒక మండ తెచ్చుకొని కానీ జమ్మి చెట్టుకు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ"శమి శెమియతే పాపం శమి శత్రు వినాశనం " అంటూ శ్లోకాన్ని పటించి పూజ చేసిన తరువాత ఆకుని జాగ్రత్తగా తెంపి పెద్దలకు పంచి పెట్టి వారి ఆశీస్సులు తీసుకొని పిల్లలకు ఆశీస్సులు మనం అందజేస్తూ మిత్రులకు పంచి అందరమూ ఆప్యాయంగా రావణాసుర దహన కార్యక్రమం తిలకించడానికి ముందుగా పాలపిట్ట ని చూసే సంప్రదాయం మనది కావున ఆ పాలపిట్టని చూసి మురిసి పోవాలని మీ అందరికి సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ... ఇట్లు
0 notes