Tumgik
tejanews · 1 month
Text
విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్ల దారి మల్లింపు
Tumblr media
విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219), గుంటూరు–విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్‌ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం – విజయవాడ (07896), విజయవాడ – మచిలీపట్నం (07769), నర్సాపూర్‌ – విజయవాడ (07863), విజయవాడ – నర్సాపూర్‌ (07866), మచిలీపట్న – విజయవాడ (07770), విజయవాడ – భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం – విజయవాడ (07870), విజయవాడ – నర్సాపూర్‌ (07861) రైళ్లు విజయవాడ – రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి. దారి మళ్లింపు.. ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643), ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో భావ్‌నగర్‌ – కాకినాడ పోర్టు (12756), ఏప్రిల్‌ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఏప్రిల్‌ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (11019), ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు ధనాబాద్‌ – అలప్పుజ (13351), ఏప్రిల్‌ 4, 11, 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్‌ (18111), ఏప్రిల్‌ 3, 10, 17, 24 తేదీల్లో జసిదిహ్‌ – తాంబరం (12376), ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో హతియ – ఎర్నాకుళం (22837), ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో హతియ – బెంగళూరు (18637), ఏప్రిల్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ – బెంగళూరు (12835), ఏప్రిల్‌ 5, 12, 19, 26 తేదీల్లో టాటా – బెంగళూరు (12889) రైళ్లు వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం
Tumblr media
AP CM YS Jagan : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్‌ బయలుదేరారు. బస్సు ప్రయాణం ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయనపల్లి, యరగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. బస్సుయాత్ర ప్రారంభించిన జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. మార్గమధ్యంలో జగన్ బస్సు దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఆయన వారి అభ్యర్థనను అంగీకరించారు. బస్‌యాత్ర నుంచి బయలుదేరే ముందు ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సీఎం జగన్‌ సందర్శించారు. మరియు ఆయన సమాధికి నివాళులర్పించారు. అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ విజయమ్మతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు, పూజారులు సీఎం జగన్‌ను ఆశీర్వదించారు.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు
Tumblr media
పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు గారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో సీమలో జగన్ మోహన్ రెడ్డి ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదన్నారు. తెలుగు దేశం హయాంలో పలు ప్రాజెక్టులు 90 శాతం పూర్తయితే… మిగిలిన 10 శాతం కూడా పూర్తి చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం BJPతో కలిశామని చంద్రబాబు చెప్పారు.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
22.5 లక్షల వీడియోలను డిలీట్‌ చేసిన యూట్యూబ్‌
Tumblr media
ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ లక్షల సంఖ్యలో వీడియోలు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలన్నీ కచ్చితంగా యూట్యూబ్‌ నిబంధనలకు లోబడి ఉండాలని తెలిసిందే. ఒకవేళ అలా నిబంధనలకు విరుద్దంగా వీడియోలను అప్‌లోడ్‌ చేస్తే యూట్యూబ్ యాజమాన్యం వీడియోనుల డిలీట్ చేస్తుంది. తాజాగా ఇలాంటి వీడియోలను భారీ ఎత్తున డిలీట్‌ చేసింది యూట్యూబ్‌. గత అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 లక్షల వీడియోలను తొలగించారు. వీటిలో ఏకంగా 22.5 లక్షల వీడియోలు భారత్‌కు చెందినవి కావడం గమనార్హం. తమ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే ఆ వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్‌ తెలిపింది. ఈ వీడియోల్లో ఏకంగా 96 శాతం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లు యూట్యూబ్‌ గుర్తించింది. ఇదిలా ఉంటే ఈ వీడియోల్లో ఏకంగా 53.46 శాతం వీడియోలు ఒక్క వ్యూ కూడా రాక ముందే తొలగించినట్లు యూట్యూబ్‌ తెలిపింది. యూట్యూబ్‌ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ అంశాల పరంగా చూస్తే.. స్పామ్‌ వీడియోలు, సెన్సిటివ్‌ కంటెంట్‌, హింసాత్మక దృశ్యాలు, తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోలు వంటివి ఉన్నాయి. ఇలాంటి కంటెంట్‌తో కూడిన వీడియోలను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించినట్లు యూట్యూబ్‌ తన నివేదికలో పేర్కొంది. కాగా యూట్యూబ్ కొన్ని ఛానెల్స్‌ను కూడా డిలీట్ చేసినట్లు తెలిపింది. గడిచిన అక్టోబర్‌-డిసెంబర్‌లో ఏకంగా 2 కోట్ల ఛానెల్స్‌ను డిలీట్‌ చేసినట్లు తెలిపింది. తప్పుదారి పట్టించే వీడియోలు, అశ్లీల కంటెంట్‌ ఉన్న యూట్యూబ్ ఛానెల్స్‌ను తొలగించినట్లు యూట్యూబ్‌ తెలిపింది. ఇదిలా ఉంటే యూట్యూబ్‌ కమ్యూనిటీలో పేర్కొన్న మార్గదర్శకాలను 90 రోజుల్లో మూడుసార్లు ఉల్లంఘిస్తే ఛానెల్‌ను రద్దు చేస్తుంది.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు
Tumblr media
Kerala CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీణా విజయన్ కంపెనీకి మినరల్ కంపెనీ అక్రమ చెల్లింపులు చేసిందంటూ సీరియస్ ఫ్రాడ్స్ బ్రాంచ్ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ED మూలాల ప్రకారం, కొచ్చికి చెందిన ప్రైవేట్ కంపెనీ ‘కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్’ (CMRL) వీణా విజయన్ యొక్క ఎక్సారాజిగ్ సొల్యూషన్స్‌లో 2017 మరియు 2018లో రూ. 1.72 కోట్లు చెల్లించింది. ఎలాంటి సేవలు పొందకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ED వర్గాలు పేర్కొంటున్నాయి. వీణా విజయన్ సెలబ్రిటీతో సత్సంబంధాలు కలిగి ఉన్నందున సేవలను అందించకుండా ఎక్సాలాజిక్‌కు CMRL నెలవారీ చెల్లింపులు చేసిందని ఆరోపించారు. అంతకుముందు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తుపై ఎక్సాలాజిక్ కంపెనీ కర్ణాటక హైకోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే, గత నెలలో ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా, తన కుమార్తె తన భార్య పెన్షన్‌తో ఐటీ కంపెనీని ప్రారంభించిందని, ఆమెపై, ఆమె కుటుంబంపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ గతేడాది జనవరిలో కేరళ అసెంబ్లీలో చెప్పారు.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Tumblr media
58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమ పథకాల రూ��ంలో పంచామని తెలిపారు. 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ పేర్కొన్నారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే దుష్టచతుష్టం అడ్డుపడుతోందని మండిపడ్డారు. దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని సీఎం జగన్ హెచ్చరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసే వారే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్ధులని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను 45 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకువస్తుందని, ఆ తర్వాత అది చెత్త బుట్టకేపరిమితమవుతుందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకానందారెడ్డిని హత్య చేసిందే ఎవరో అందరికి తెలుసున్నారు. హంతుకుడికి తన ఇద్దరి చెల్లెమ్మలు మద్దతు ఇస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం
Tumblr media
ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న లోక్‌సభ స్థానాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇప్పటికే 2 దఫాల్లో 9 మందిని ఏఐసీసీ ప్రకటించింది. 8 స్థానాలు ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్‌పై ఇవాళ చర్చించి సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. 8 స్థానాల్లో 6 స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మూడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మము, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నారు. రెఫరెండమే! ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, తుమ్మల యుగంధర్, రాజేంద్ర ప్రసాద్‌లు టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు ''ఈ రోజు రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తిగా గ్రౌండ్‌లోనే హస్తం శ్రేణులు ఉండనున్నాయి. పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తూ రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ స్ట్రాటజీపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. టార్గెట్ 14 రీచ్ అవ్వాల్సిందేనని రేవంత్ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేస్తున్నారు.. కేపి
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు
Tumblr media
అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల నేతలతో పవన్‌ కల్యాణ్ సమావేశమై చర్చించారు. మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచిన జనసేనాని.. స్థానిక ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం పోతిన మహేశ్‌ పవన్‌ను కలిశారు. మరో రెండ్రోజుల్లో అభ్యర్థులను ఫైనల్‌ చేసేందుకు కసరత్తు చేస్తునట్టు సమాచారం. మార్చి 30న పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌
Tumblr media
హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బ్రిటీష్‌ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతోపాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందన్నారు.. ''కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉంది. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందిస్తున్నా. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలి. న్యాయవ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలి. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలి. ఇటీవల ఈ-కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి''అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నర్సింహా, జస్టిస్‌ పి.వి. సంజయ్‌ కుమార్‌, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు..
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
ఐపీఎల్ చరిత్ర లో SRH రికార్డ్
Tumblr media
ముంబై బౌలింగ్ ను చిత్తు చేసి విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఐపీఎల్ లో 20 ఓవర్లలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా SRH రికార్డ్ గతంలో ఉన్న 263 స్కోర్ రికార్డ్ బ్రేక్ 20 ఓవర్లలో 277 స్కోర్ చేసిన SRH..
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
ఆంధ్రప్రదేశ్ NDA కూటమి నేతల సమావేశం
Tumblr media
పురందేశ్వరి నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, మధుకర్, బిజెపి ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్ సహ ఇన్ చార్జి సిద్దార్ధ సింగ్ ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ అగ్ర నేతల పర్యటనలపై సమాలోచనలు అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా అగ్ర నేతల ప్రచారం ఉండేలా ఎన్డీఏ కూటమి ప్రణాళికలు..
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్‌ కల్యాణ్‌
Tumblr media
పొత్తు ధర్మాన్ని పాటించి కూటమిని గెలిపిద్దాం. ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు. మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్‌ కల్యాణ్‌.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో
Tumblr media
హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో హీరో బాలకృష్ణ మరియు టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు…
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
మ్మెల్సీ కవితకు 14 రోజుల రిమాండ్..తీహార్ జైలుకు వ్యాన్ లో తరలింపు
Tumblr media
MLC Kavitha : సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు జైలుకు పంపింది. కవితకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా ఢిల్లీ పోలీసులు జైలుకు పంపారు. ఆమెను జైలు వ్యాన్‌లో తరలించారు. ఆమెను ఏప్రిల్ 9 వరకు తీహార్ జైలులో ఉంచనున్నారు. ఇదిలా ఉండగా…ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఎమ్మెల్యే కవితకు(MLC Kavitha) ఈడీ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. కవితకు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించనున్నారు.ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.అయితే కవితను అదుపులోకి తీసుకోవడం ఇది మూడోసారి. మొదటి ఏడు రోజులు, తర్వాత మూడు రోజులు, ఇప్పుడు 14 రోజుల రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. తీహార్ జైలులో కవితను విచారించే అవకాశముంది. కాగా, ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసుకున్నారు. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పిటిషన్‌పై స్పందించేందుకు సమయం కావాలని ఈడీ కోర్టుకు తెలియజేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బెయిల్ దరఖాస్తుపై ఏప్రిల్ 1న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో భద్రతా దళాల కూబింగ్
Tumblr media
మన్యం జిల్లా:మార్చి26 మన్యం జిల్లా పార్వతీపురం ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ల్లో, ఏవోబీ మావోస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ సీవో బీ డి.కాయ్‌ 65 బెటాలియ న్‌ పార్వతీపురం పరిధిలోని సుంకీ అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం కూబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మావో యిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించామని బెటాలియన్ కమాండ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సందీప్ కెర్‌కెట్టా తెలిపారు. మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంతాం బడేవలస, పద్మా పురం గ్రామాలకు మూడు, 4 కి.మీటర్ల దూరంలో ఉంది. కూంబింగ్‌లో భాగంగా భద్రతా దళాలు హేండ్‌ బౌలర్‌, టిగ్గర్‌ మెకానిజం, ఫిల్లర్లు, హేమర్‌, స్లీపర్‌, చేజల్‌, ఫైల్‌, కత్తులు, ఇనుప బిట్లను సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం
Tumblr media
కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు పెద్దసంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో తమ అభిమాన నాయకుడిని గెలిపించుకుంటామని స్థానికులు పేర్కొన్నారు. రెండు నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించారు. అర్చకుడిపై దాడి.. హేయమైన రాక్షస చర్య: చంద్రబాబు కాకినాడలోని శివాలయంలో అర్చకుడిపై వైకాపా నేత దాడి ఘటనను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ''అర్చకుడు అంటే దేవుడికీ, భక్తుడికీ మధ్య అనుసంధాన కర్తగా భావించి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. అటువంటి పూజారులను భక్తుల సమక్షంలోనే కాలితో తన్నడం, దాడి చేయడం హేయమైన రాక్షస చర్య. వైకాపా నేతల అధికార మదానికి, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు వరుసగా దేవాలయాల్లోని విగ్రహాలపై దాడులు జరిగాయి. ఒక్క కేసులోనూ నిందితులపై చర్యలు లేవు. ఇప్పుడు ఏకంగా గుడిలో అర్చకులపైనే దాడి చేసే పరిస్థితి వచ్చింది. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి'' అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.
Tumblr media
Read the full article
0 notes
tejanews · 1 month
Text
రేపు జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి సర్వం సిద్ధం
Tumblr media
రేపు ఉప్పల్‌లో జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి స్టేడియంలో 2800 మంది పోలీసులతో, 360 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు.. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్‌లకు స్టేడియంలో అనుమతి లేదని మీడియాకి తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు.
Tumblr media
Read the full article
0 notes