Tumgik
#Krishansbutterball
praveenmohantelugu · 1 year
Video
youtube
మహాబలిపురంలో వివరించలేని శిల్పాలు! ఎవరికి తెలియని నాగుల రహస్యం!
Hey guys, ఈ రోజు మనం south indiaలో ఉన్న మహాబలిపురంలో ఉన్నాము, ఇప్పుడు నేను మీకు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద bas relief అని పిలువబడే ‘అర్జున తపస్సు’ ను చూపించబోతున్నాను, ఇది 1300 సంవత్సరాలకు ముందు చెక్కబడింది. ఈ రిలీఫ్ దాదాపు 96 అడుగుల వెడల్పు 43 అడుగుల పొడవు ఉంది. ఇది చాలా రహస్యాలతో నిండి ఉంది, ఎందుకంటే ఈ చెక్కడం మన పురాతన కాలంలో astronaut మరియు ఆకారాన్ని మార్చగల reptilian theoriesను prove చేస్తుంది. 
Reptilian theory ప్రకారం, Reptilian అంటే ఎవరికి తెలియకుండా ఆకారాలను మార్చుకుంటూ భూగర్భాలలో నివసిస్తూ, గాలిలో ఎగర గల సామర్థ్యంతో మనుషుల లాగ రూపాన్ని మార్చగల గ్రహాంతరవాసులు అని చెప్తున్నారు. ఎవరో ఒక వ్యక్తి ఈ విచిత్రమైన conceptను 2001లో సృష్టించినట్లు అనిపిస్తుంది, ఇంకా ఇలాంటి ఒక విషయాన్ని మీరు ఎప్పుడు కూడా వినబడనట్లుగా ఉన్నారు కదా? నేను ఇప్పుడు మీకు చిప్పిన ఈ Reptilian theoryని మన పురాతన శిల్పులు ఈ ప్లేస్ లో దాదాపు 1300 సంవత్సరాలకు ముందే చాలా accurateగా చెక్కారు. రండి ఇప్పుడు దీనిని ఇంకొంచెం బాగా పరిశీలిద్దాం. 
దీన్ని చూడగానే మధ్యలో ఉన్న చెక్కడంపై నా ద్రుష్టి మళ్లింది, ఎందుకంటే ఈ చెక్కడంలో ఇద్దరు నాగ దేవుళ్ళు భూమిని పగలగొట్టుకుని భూమి నుండి బయటకు వస్తున్నట్టు ఉంది చూడండి. వీళ్ళను సగం మానవ శరీరం మరియు సగం పాము శరీరాలతో ఉన్నట్టు చూపించారు. రెండవ దేవుని కింద మూడవ దేవుడ్ని చూడండి, అతను ఇంకా సగం మనిషిగా రూపాంతరం చెందకుండా పూర్తిగా పాము శరీరం లాగానే ఉన్నాడు. ఈ దేవుళ్ళు పాము శరీరాల నుండి సగం మానవరూపాలుగా మారిన తర్వాత భూమి పైకి వస్తున్నదాన్ని ఇది మనకు చూపిస్తుంది. 
ఈ reptilian అనే ‘పాము దేవతలు’ లేదా నాగాలను అనేక పురాతన హిందూ గ్రంథాలలో మరియు బౌద్ధ గ్రంథాలలో నమోదు చేయబడ్డారు. Archeologistలు ఈ చెక్కడాన్ని చూసి చాలా confusion లో ఉన్నారు, ఎందుకంటే అసలు ఈ చెక్కడం, ఏం చూపుతుందో అని, వాళ్ళు ఒక conclusion కి రాలేకపోతున్నారు. కొంతమంది దీన్ని చూసిన వెంటనే ఇది అర్జునుడు తపస్సు చేస్తున్న pose అని చెప్తున్నారు. మేరె చూడండి, ఈ మొత్తం చెక్కడంలో, చిన్నగా ఉన్న ప్లేస్ లో చెక్కిన, ఈ సన్నని వ్యక్తి, ద్రుష్టిని మళ్ళించాడని మీరు అనుకుంటున్నారా? 
ఒక సామాన్యుడికి మొట్టమొదటిగా దీన్ని చూసేటప్పుడు ఈ రాయిని రెండు భాగాలుగా సమానంగా విభజించి, భూమిని చీల్చుకుని బయటకు వచ్చి, ఆకాశం పైకి ఎగురుతున్న, ఈ బొమ్మలపైనే అతని దృష్టి మళ్లుతుంది. ఈ reptilians అన్ని ఇప్పట్లో ఉన్న modern day rockets లాగానే blast అవుతూ పైకి ఎగురుతున్నాయి, చెప్పాలంటే ఈ theoryని support చేసే విధంగా అనేక ఫీచర్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అవేంటంటే ఇక్కడ ఆ పేలుడు sounds వల్ల చాలా జంతువులు బయపడి బెదరడం కూడా మీరు చూడవచ్చు. 
జింకలు, సింహాలు మరియు కోతులు లాంటి చాలా రకాల జాతుల జంతువులు కూడా భయపడడం మీరు చూడవచ్చు. sometimes ఇలాంటి blast అయ్యేటప్పుడు మనమే బయపడుతాము, మరి జంతువులు భయపడ కుండా ఉంటాయా చెప్పండి. ఇక్కడ చుడండి, ఒక పెద్ద తండ్రి ఏనుగు ఆ sounds లకు భయపడిపోయిన పిల్ల ఏనుగులను తన కాళ్ళ మధ్య ఎలా  protect చేస్తుందో చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు, ఇక్కడున్న ప్రతి మనిషి యొక్క hand signalను చూడండి. వాళ్ల చేతులన్నీ 45 డిగ్రీ angleలో నేరుగా take off చేయండి అని పైకి చూపిస్తున్నారు. 
నిజం చెప్పాలంటే నేను ఇండియాలో ఉన్న, 24 కంటే ఎక్కువ పురాతన ప్రదేశాలకు వెళ్ళాను, కానీ నేను మరెక్కడ కూడా ఇలాంటి hand signalని చూడలేదు. ఇది ఎలాంటి అర్ధం లేకుండా ఉంది. ఇక్కడ పైభాగంలో బాగా గమనించి చూడండి, పెద్ద helmetలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు రెండువైపులా నిలబడి ఒకే hand signalను చూపిస్తున్నారు. ఇక్కడ ఇదంతా జరుగుతుండగా, astronauts take off అవ్వడాన్ని ఒక పెద్దాయన నిలబడి చాలా calmగా గమనిస్తున్నాడు. ఇక్కడ మరొక interesting అయిన విషయం ఏంటంటే, ఈ చెక్కడంలో ముఖ్యమైన దేవుళ్ళు ఎవరూ లేరు. 
ఈ bas reliefలో శివుడు, విష్ణువు లేదా ఇతర ముఖ్యమైన దేవుడు ఎవరూ లేరని, హిందూ వేదాంతవేత్తలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అలానే మన దగ్గర ఉన్న వేలాది హిందూ గ్రంథాలలో, ఏ ఒక్క చోట కూడా ఇలాంటి ఒక దృశ్యాన్ని వర్మించలేదు. హిందూ పురాణాలలోని ఈ నాగాలు, యూదుల పురాణాలలోని నచాష్‌ అనే character ని పోలి ఉన్నాయి. హిందువులు, నాగులను సర్పాలు అని కూడా పిలుస్తారు, ఇంకా యూదులు మరియు క్రిస్టియన్స్ సెరఫ్ అని పిలుస్తారు. ఈ గ్రంథాలన్నీ వారిని ఎగిరే దేవతలు లేదా దేవదూతలుగా సూచిస్తాయి. భారతదేశంలో అరణ్యాలలో నివసించే నాగాలు అనే జాతి కూడా ఉంది. 
మొదట, బృహస్పతి గ్రహం నుండి, వాళ్ళ సర్ప దేవతలు వచ్చారని, వాళ్ళు నమ్ముతున్నారు. ఈ relief, గంగానది యొక్క అవరోహణను చూపిస్తుందని, హిందూ వేదాంతవేత్తలు మరో వివరణ ఇస్తున్నారు, కానీ దాన్ని ఎక్కడ కూడా జోడించలేదు. అన్ని హిందూ గుడులలో, గంగను ఎప్పుడూ దేవతగానే చెక్కుతారు, వాళ్ళు ఎప్పుడూ నదిగా ఊహించుకోరు. ఇంకా, శివునితో ఎప్పుడూ తన భర్త అయిన గంగతోనే చెక్కుతారు. కానీ, అతను ఎక్కడా కనిపించడు! కాబట్టి, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ శిల్పాలు పురాతన reptilian దేవుళ్లను పేల్చినట్లు చూపుతాయని మీరు అనుకుంటున్నారా? లేకపోతే, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బాస్ రిలీఫ్ యొక్క ఉద్దేశ్యం ఏంటీ?
- Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 1 year
Video
youtube
కృష్ణుడి వెన్న బంతిని గ్రహాంతరవాసులు తీసుకొచ్చారా? కృష్ణుడి బట్టర్‌బాల్ గురించి షాకింగ్ నిజాలు!
Hey guys, ఈ రోజు మనం South ఇండియాలోని   మహాబలిపురంలో ఉన్నాము, ఇప్పుడు Krishna's butter ball అంటే కృష్ణుడి వెన్న బంతి అని పిలువబడే ఈ రహస్యమైన రాతి గురించే చూడబోతున్నాము. ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది జారే కొండపై 2 చదరపు అడుగుల కంటే తక్కువగా చాలా చిన్న బేస్ విస్తీర్ణంలో balance చేస్తూ నిలబడి ఉంది. మీరు ఒక వాలుపై బంతిని పెడితే ఏం జరుగుతుందో కొంచెం ఊహించండి. అది అలానే దొర్లుతూ కిందికొచ్చేస్తుంది, కానీ ఈ బండరాయి కనీసం 1200 సంవత్సరాలుగా అలానే నిలబడి ఉంది. 
ఈ గ్రానైట్ రాయి 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుగా ఉంది, 250 టన్నులకు కంటే ఎక్కువ బరువు ఉంటుందని అనుకుంటున్నాను. దీని వెడల్పు దాదాపు దాని ఎత్తుకు equalగా ఉంది, దీన్ని కొన్ని anglesలలో చూస్తే, ఒక perfect ఐన గోళంలా ball లాగ కనిపిస్తుంది కదా, but ఇవి equal shapes తో లేదు. దాని కింద చాలా మంది కూర్చోవడం మీరే చూడవచ్చు, దీని నుండే ఇది ఎంత పెద్దదిగా ఉందని మీకే అర్ధమైయుంటుంది. చాలా మంది ఈ రాయిని సహజంగా ఏర్పడిన నిర్మాణం అని అనుకుంటారు. అయినప్పటికీ, ఇలాంటి ఒక రాయి సహజంగా ఏర్పడడం అసాధ్యం ఎందుకంటే ఇది కోతపడి, నీళ్లు పడి, వీచే గాలికి ఈ విధంగా వచ్చే అవకాశం లేదు. 
మీరు ఈ బండరాయి నిలబడి ఉన్న ఈ place చుట్టూ చుడండి, అంతా చాలా smooth గా ఉంది, ఇంకా ఇక్కడ ఏ పెద్ద రాయి కూడా దీనిలా లేదు.   So ఇది సహజంగా ఏర్పడినది కాకపోతే దీన్ని ఎవరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు? modern daysలలో కూడా, 250 టన్నుల, బరువు ఉన్న రాతిని ఎత్తుకుని, పైకి తీసుకుని వచ్చి, అది కూడా ఈ వాలుగా ఉన్న కొండపై. ఉండడం చాలా కష్టమైన పని, దీనికి cranes లాంటి పెద్ద పెద్ద పరికరాలు అవసరమవుతాయి, అయితే దీన్ని 1200 సంవత్సరాలకు ముందు ఎలా చేశారు? ఈ రాయి యొక్క base ని చూసుకుంటే, ఏదో ఒక విధంగా క్రింద ఉన్న కొండకు గట్టిగా gum వేసి అతికించినట్టు అతుక్కొని ఉంది. 
నిజానికి 1908లో మద్రాసుకు గవర్నర్‌గా ఉన్న ఆర్థర్ లాలీ అనే ఆయన ఈ రాయి చాలా ప్రమాదకరమైనదని, ఎప్పుడైనా కొండపై నుంచి జారిపడుతుందని, ప్రజలకు danger అని అనుకున్నాడు. కాబట్టి ఆ బండను కిందకు తోసేయమని order వేసాడు. ఈ బండను కిందికి నెట్టడానికి ఏడు ఏనుగులను ఉపయోగించారు. కానీ రాయి ఒక్క అంగుళం కూడా కదలలేదు! ఆ గవర్నర్‌ ఈ బండరాయిని కిందకు నెట్టడం అనేది అసాధ్యమైన అని చేతులెత్తేశారు! ఒక ఏనుగు 6 టన్నుల బరువును నెట్టగలదని లేదా లాగగలదని మనకు తెలుసు. అయితే ఇక్కడ మొత్తం 7 ఏనుగులను ఉపయోగించి 42 టన్నుల weight ని లాగడానికి కావలసిన పవర్ దానికి ఉంటుంది, కానీ కేవలం 2 square feet బేస్‌లో నిలబడి ఉన్న ఈ "వెన్న బంతి" రాయి కింద బిగించినట్టుగా అతుక్కుని ఒక్క ఇంచ్ కూడా కదలలేదు! 
ఒకవేళ దీని కింద ఏదైనా దాగి ఉందా? ఇప్పుడు, ఇక్కడే మరింత interesting ఐన ప్రశ్న ఉంది: ఈ రాయిని క్రిందికి నెట్టడం అసాధ్యం అయితే, దీన్ని ఎలా పైకి తీసుకోచుంటారు? ఇది ఇప్పుడు చేయడానికి మనుషులకు అసాధ్యం అయితే, ఇది నిజంగా మనుషులే చేశారా అని మనం ఆలోచించాలి కదా. ఇలాంటి advanced ఐన technology గ్రహాంతరవాసుల నుండి వచ్చి ఉంటుందా? ఇప్పుడు ఈ రాయి కొండపైన ఎలా ఉందో చూద్దాం రండి. ఇది 2 square feet కంటే తక్కువైన ఒక point. ఒక నిర్మాణం ఎక్కువ కాలం ఉండాలంటే దానికి విశాలమైన base ఉండడం ముఖ్యమని ఒక సామాన్యమైన మనిషి కూడా తెలుసు. 250 టన్నుల weight ఉన్న ఒక బండరాయి, 2 square feet కంటే తక్కువైన బేస్‌లో ఎలా నిలుస్తుంది? 
పునాది లేకుండా, వాలుగా ఉన్న స్థలంలో 2 square feet బేస్‌తో 3 అంతస్తుల ఇల్లును కట్టాలని ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రాయిని "కృష్ణుని వెన్న బంతి" అని అందరూ పిలిచినా కూడా, దీని original పేరు అది కాదు. "వాన్ ఇరై కల్" అనేదే ఈ రాయి యొక్క అసలైన పేరు, అంటే ఆకాశం నుండి వచ్చిన దేవుని రాయి అని అర్ధం. ఈ పెద్ద రాయిని ఇక్కడ పెట్టిన ఆ స్కై గాడ్ ఎవరు? ఈ రాయిపై ఎలాంటి శిల్పాలుగాని లేదా ఏ శాసనాలు గాని లేవు చూడండి. నిజానికి, మహాబలిపురంలో ఉన్న నిర్మాణాలలో ఇది ఒక్కటే మాత్రమే ఎలాంటి శిల్పాలు లేకుండా ఉంది. 
ఇంకొక interesting ఐన విషయం కూడా ఉంది, నరసింహవర్మన్ అనే పల్లవ రాజు ఈ "ఆకాశ దేవుని రాయి" ని శిల్పులు ఎవ్వరు కూడా తాకకూడదని order వేసాయారని చెప్తున్నారు. కాబట్టి, 7వ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మన్ పరిపాలనకు ముందే ఈ రాయి ఇక్కడ ఉండుండాలి. ఇది ఒక జారే కొండ పైన నిలబడి ఉంద��ి మనం అర్థం చేసుకోవడం ముఖ్యమైన విషయం. ఈ కొండ 30 అడుగుల ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ కొండ అసలు ఎత్తు ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ భూమి మట్టం పెరుగుతూనే ఉంటుంది! పక్కన ఉన్న సముద్రం, ఇసుకను నేలకు కొట్టుకు వస్తుంది. ఇక్కడ పక్కనే ఒక ర్యాంప్ అంటే వాలుగా ఒక ప్లేస్ ఉంది, ఇది 5 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉంది. 
ఒక 10 సంవత్సరాలకు ముందు, ఈ ర్యాంప్ 15 అడుగుల ఎత్తులో ఉనిందంట, ఇంకా పిల్లలు దీనిపై స్లయిడ్‌ చేస్తూ ఆడుకునే వాళ్లంట. ఈ కొండ నెమ్మదిగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు లోపలికి పాతి పెట్టబడుతూ ఉంది. అయితే, 1200 సంవత్సరాలకు ముందు ఈ కొండ ఎంత ఎత్తుగా ఉండేదో ఊహించుకోండి! ఇది ఒక కొండ లాగా ఇంచుమించు 1000 అడుగుల కంటే ఎత్తుగా ఉండుంటుంది. ఇంత ఎత్తులో బంతి లాంటి ఈ పెద్ద రాయిని ఎలా ఉంచారు? మీరు ఈ రాయిని ఇతర పురాతన నిర్మాణాలతో పోల్చినట్లయితే, ఇది పెరూలోని యొక్క ఏకశిలా రాయి కంటే పెద్దది మరియు బరువుగా ఉంది.
- Praveen Mohan Telugu
1 note · View note