Tumgik
#ancientconstruction
praveenmohantelugu · 1 year
Video
youtube
ఏంటి! రావణునికి ఇలాంటి తమ్ముడు ఉన్నాడా? లోకమంతా పూజించి కొనియాడబడిన వైశ్రవణుడు!
Hey guys, ఈ రోజు మనం కొలంబియాలో ఉన్న పురాతన విగ్రహాలను చూడబోతున్నాము. ఇక్కడ ఉన్న విగ్రహాలు దాదాపు వేయ్యి సంవత్సరాలు పురాతనమైనవి, ఇంకా అవి మన ఇండియన్ culture తో కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకి, కొలంబియాలో San Agustin Archeological Parkలో ఉన్న ఈ మర్మమైన SpaceMan ని చూడండి. ఇది సౌత్ అమెరికాలో, city చాలా దూరంగా ఒక మారుమూల ప్రాంతంలో ఉంది, ఇక్కడ వందలాది విగ్రహాలు ఉన్నప్పటికీ ఇది ఒక్కటే మన దృష్టిని ఆకర్షిస్తుంది. 
ఎవరు ఇతను? first దీన్ని చూడగానే ఇది ఒక పురాతన వ్యోమగమిగా అంటే ఒక astronaut గా  అనిపిస్తుంది, ఎందుకంటే అతను ఒక హెల్మెట్ లేదా కవచం లాంటిది వేసుకుని ఉన్నాడు, ఇంకా అతని కళ్ళు, నోరేమో rectangular షేప్ లో ఉంది, ముక్కు అస్సలు లేదు. అతని తల ఇంకా బాడీ సైజ్ చూడండి, ఇవి రెండు సంబంధం లేకుండా ఉంది, శరీరం చిన్నగా తల చాలా పెద్దగా ఉంది, ఇంకా అతను షూస్ వేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. 
But చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను ఒక పొడవైన సిలిండర్ లాంటిది పట్టుకుని ఉన్నాడు, అది ఒక tool లాగా ఉంది, చూడండి అది అతని పాదం కిందనుండి భూమి లోపలకి వెళ్తుంది. ఇది చాలా ఇంటరెస్టింగ్ ఐన విషయం, దీని గురించి archeologists and historians దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇక్కడ ఉన్న టూర్ గైడ్ లకు కూడా దీని గురుంచి తెలియలేదు, అది ఒక musical instrument ఫ్లూట్ అని అంటున్నారు.ఒకవేళ ఇది ఫ్లూట్ అయితే భూమి లోపలికి వెళ్లే విధంగా అంత పొడవుగా ఎందుకు ఉంది? 
అలా వెళ్లినా కూడా అందులో నుండి ఎలా music వస్తుంది? ఇది ఏంటని చెప్పండి. ఈ ప్రశ్నకు ఏ ఒక్క సమాధానం లేదు, కానీ మన సంస్కృతిలో దాదాపు ఇలాంటి పోలికలు ఉన్న ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మొదటి దేవుడు స్వర్ణాకర్షణ భైరవ. ఈయన తన ఆయుధంతో భూమిలో నుండి direct గా బంగారం తీయడం వల్ల ఈయన్ని బంగారానికి అధి దేవత అని అంటారు. మరొక ముఖ్యమైన దేవత ఎవరంటే, వైశ్రవణ. అతను రాక్షస రాజు రావణుడికి అన్నయ్య వరస అవుతాడు.  ఎవరీ వైశ్రవణ? 
అతను ఏమి చేస్తాడు? అతను కూడా సంపదలకు అధిపతి, ముఖ్యంగా బంగారానికి. ఈయన దగ్గర కూడా భూమి లోపలికి వెళ్లే విధంగా ఒక ఆయుధం ఉంది. కానీ ఇండియా కొలంబియాల మధ్య పది వేల మైళ్ళ దూరం ఉంది అని గుర్తుపెట్టుకోండి, సో ఒక హిందు దేవత కొలంబియా లో ఎలా చెక్కబడింది?ఇది ఒక valid ఐన ప్రశ్నే, దీనిని మనం logicగా చూసి understand చేసుకుందాం. ఇండియాలో ఈ వైశ్రవణుడిని ఏ విధంగా చూపించారని కొంచం చూడండి. ఈ విగ్రహం దాదాపు పదహారు వందల సంవత్సరాలు పాతది, అతనిని సంపదకు సూచకంగా గుండ్రటి కుండాలాంటి నాభితో ఉన్నాడు చూడండి. 
ముఖ్యంగా అతని చేతిలో ఉన్న రాడ్ లాంటి పరికరం సాధారణంగానే  భూమిలోకి వెళ్లడమే. ఇప్పుడు మనం ఈ వైశ్రవణుడు థాయిలాండ్ లో ఎలా పరిణామం చెందాడో అని చూదాం. పురాతన కాలంలో హిందూత్వం థాయిలాండ్ వరకు వ్యాపించి ఉండడంతో, వైశ్రవణుడిని ఇక్కడ చాలా సన్నగా, చాలా ఉగ్ర దేవతగా చెక్కారు. కానీ భూమి లోకి వెళుతున్న పరికరం మాత్రం అలాగే వుంది చూడండి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అతను థాయిలాండ్ లో ఉన్న ఉడాన్ థాని అనే ప్రాంతానికి official emblem గా అంటే అధికారిక చిహ్నంగా ఈయన్ని పెట్టుకున్నారు. 
కేవలం అతని ఆకారం మాత్రమే మారలేదు, అతని పేరు కూడా థాయిలాండ్ లో పరిణామం చెందింది. వైశ్రవణుడిని థాయిలాండ్ లో వైస్సావన అని పిలుస్తారు, పేరు మారినప్పటికీ కానీ కథ మాత్రం ఒక్కటే, సో ఇద్దరు ఒకరే. హిందూత్వం ఇంకా దూరంగా చైనా వరకు వ్యాపించినప్పుడు, వైశ్రవణుడిని ఈ విధంగానే చెక్కారు. ఇవి చైనాలో ఉన్న యునాన్ ప్రావిన్స్‌లో ధరణి స్తంభాలు అని పిలువబడే ఈ పురాతన స్తంభాలు ఉన్నాయి, ఇవి వెయ్యి సంవత్సరాల కంటే పాతవి, ఇక్కడ కూడా  మూలాంశాలన్నీ నెమ్మదిగా మారుతున్నప్పటికీ భూమిలోకి వెళుతున్న స్థూపాకార లాంటి పరికరం మాత్రం అలాగే వుంది.ఇది కూడా చైనా Yunnan provinceలో ఉన్న మియిన్ అనే గుడిలో ఉన్న వైశ్రవణుడు యొక్క మరొక విగ్రహం. 
తరువాత హిందూత్వం ఇంకా వ్యాపించి జపాన్ వరకు చేరిన తరువాత, అతను ఎలా ఉన్నాడో చూడండి. Archaeologistsలు మరియు historiansలు జపాన్ లో ఉన్న వైశ్రవణుడు ఇంకా హిందూ పురాణాలలో ఉన్న వైశ్రవణుడు ఒక్కటే అని ఒప్పుకున్నారు,  థాయిలాండ్ లో అతని పేరు వైశ్రవణుడు నుండి వేస్సావనగా మారి, జపాన్ లో ఇంకొంత మారి బిశామోన్ గా పిలవబడుతున్నాడు. పేర్లు పలువిధాలుగా మారినా కూడా, భూమిలోకి వెళ్లి బంగారం తీసే ఆ సిలిండర్ లాంటి పరికరం మాత్రం మారన్ లేదు. 
కానీ ఇక్కడ వైశ్రవణుడు, శరీరం అంతా కవర్ అయ్యే సూట్ లాంటి కవచం వేసుకుని ఉన్నాడు, ఇంకా ఒక హెల్మెట్ షూస్ కూడా వేసుకుని ఉన్నాడు. సో ఇండియా నుండి జపాన్ వరకు వైశ్రవణుడు ఏ విధంగా మార్పు చెందడో అని మనం చూడగలిగాము, దీనికి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు వికీపీడియాలో కి వెళ్ళి వైశ్రవణ అని చూస్తే, మీకు ఈ విషయాలు అన్ని కనపడతాయి, అతని పేరు వైశ్రవణ నుండి వేస్సావన గా, బిశామోన్ గా, బిషమోంటెన్ గా ఎలా మరిందో తెలుస్తుంది. Mainstream historians దీనిని ఒప్పుకుంటున్నారు. Experts లు ప్రముఖమైన హిందు సంస్కృతి అనే ఈ కల్చర్ జపాన్ దగ్గర ఆగింది అని అనుకుంటారు.
- Praveen Mohan Telugu 
1 note · View note
Photo
Tumblr media
Still More Chaco Culture National Historical Park Photos - 3 These last 3 photos show the buildings and their layout. I hope you find it interesting. #ChacoCanyon #AncientDwellings #ChacoCultureNationalHistoricalPark #AncientPuebloPeople #NativeAmericanHeritage #AncientRuins #PuebloStructures #PhotosByJeriRae #AncientConstruction (at Chaco Culture National Historical Park) https://www.instagram.com/p/CQPckIaLhsg/?utm_medium=tumblr
0 notes
kulturista · 6 years
Photo
Tumblr media
Coup de coeur! #KunkovácsLászló #Szank #ethnography #Hungary #Architecture #hungarianarchitecture #villagearchitecture #farmarchitecture #agriculturalarchitecture #spontaneousarchitecture #foundobject #Objettrouvé #ancientstructures #ancientarchitecture #ancientconstruction #ancientstructure #archaicarchitecture #archaicdesign #archaicconstruction #archaicarchitecturte #oven
0 notes
fotomojophotography · 5 years
Photo
Tumblr media
@fotomojophotography Osiris Temple Guide www.fotomojo.com.au #osiris #curseofosiris #templeosiris #temple #temple🙏 #temples #architecture #ancientegypt #ancient #ancientwisdom #ancientcivilization #ancientconstruction #ancientbuilding #ancientbuildings #guides #egyptian #egyptianguide #localguides #travelguides #tourguides #touristguides #egypt #egyptian #egyptology #egypt🇪🇬 #egypte http://bit.ly/2ILmdy2 Instagram+Tumblr+Flickr+Twitter: @fotomojophotography Pintrest:Foto Mojo www.fotomojo.com.au e:[email protected]
0 notes
greaterthanever · 7 years
Photo
Tumblr media
Standing still... Ainda de pé... #romanarquitecture #fororomano #romecollumns #romanbuilding #ancientconstructions #ancientrome #povosromanos #colunasromanas #romaantiga #amazing #wonderful #astonishing #incredible
0 notes
praveenmohantelugu · 1 year
Video
youtube
గ్రహాంతరవాసులను భూమిపైకి తీసుకొచ్చిన గ్రహాంతరవాసుల నాయకుడు! రుజువు చేస్తున్న చెక్కడాలు!
Hey guys, ఈ రోజు నేను కొలంబియాలో ఉన్న ఎల్ టబ్లోన్ అని పిలవబడే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాను, ఎల్ టబ్లోన్ అంటే spanish లో platform లేదా flat board అని అర్ధం. ఈ ప్రదేశంలో చాలా విచిత్రమైన పురాతన శిల్పాలు ఉన్నాయి, ఆ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ alien లాగ ఉన్న ఒక శిల్పం ఉంది, అంటే గ్రహాంతర వాసుల శిల్పం ఉంది. ఇక్కడ రోడ్లు సరిగ్గా లేదు అది మాత్రమే కాకుండా చాలా ఇరుకుగా కూడా ఉంది. ఈ కొలంబియాకి చాలా దూరంగా ఉన్న ఒక మారుమూల ప్రాంతం కాబట్టి రోడ్ sideలో చాలా చెట్లు మరియు మొక్కలు పెరిగి ఉన్నాయి. 
నేను చెప్పిన ప్రాంతం ఈ రోడ్డుకి దగ్గర్లో ఎక్కడా లేదు, అంటే మేము మా ట్రక్కును పార్క్ చేసి నడిచే పోవాలి. ఈ ప్రయాణంలో, కొలంబియా గైడ్ నాకు help చేస్తున్నారు. కొలంబియా archeology department వాళ్ళు ఈ శిల్పాలున్న ప్రాంతానికి వెళ్ళడానికి మెట్లను తయారు చేసి దారి చేశారు, కానీ ఈ ప్రాంతం చాలా మారుమూల ప్రాంతంలో ఉన్న కారణంగా ఎవరూ ఇక్కడికి రావడంలేదు. నేను సుమారు 30 నిమిషాలుగా నడిచిన తరువాత చివరికి 'లా చక్విరా' కు చేరుకున్నాను. మీరు ఈ బొమ్మను చూసిన వెంటనే మీకు ఒక వింత అనుభూతి కలుగుతుంది. Wow, ఇలాంటి ఒక విచిత్రమైన శిల్పాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. 
దాని కళ్ళు normalగా మనుషులకు ఉండే విధంగా కాకుండా చాలా పెద్దవిగా ఉన్నాయి చూడండి, అలానే దాని ముఖంలో ఒక కొంటె చిరునవ్వు ఉంది. ఈ విగ్రహం origin ఏంటీ? ఇది ఎక్కడి నుండి వచ్చింది? దీని గురించి archeologistలకు పెద్దగా ఏం తెలీదు, కానీ అతని వేలు ఆకాశం వైపు చూపిస్తూ ఉండడంతో, దానికి ఏదో సమాధానం ఇస్తున్నట్టు ఉంది కదా. అతను కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆకాశం నుండి వచ్చారా? రండి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్లి, దీని గురించి ఏదైనా ఇతర సమాచారం దొరుకుంతుందేమో చూద్దాం. సాధారణంగా ఎవరూ ఇలా రాళ్ల పైకి ఎక్కి దగ్గరకు వెళ్లి చూడరు. 
ఈ చక్విరా పైన చిన్నగా ఏదో పొడుచుకు వచ్చిన helmet ఉన్నట్లు కనిపిస్తుంది, దీన్ని చూస్తుంటే ఒక transmitter లేదా antenna లేదా ఒక topknot అయిన అయ్యుండొచ్చు. కింద చూడండి, అతను కాళ్లకు బూట్లు వేసుకున్నాడు, అలానే రెండు కాళ్ళు వేరువేరు దిశల్లో ఉన్నాయి చూడండి. దిశల గురించి చెప్పాలంటే, చక్విరా తూర్పు వైపుకు చూసినట్లు కనిపిస్తుంది, దీనికి సూర్యోదయంతో ఏదైనా సంబంధం ఉండవచ్చు. ఇది చాలా అద్భుతమైన ఒక ప్రదేశం, ఈ వైపు చూశారంటే ఒక లోయ ఉంది, మరొక వైపు జలపాతాలు, ఒక నది, మరియు చుట్టూ ఎవరూ లేరు, ఈ శిల్పాలను చెక్కడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. 
ఈ శిల్పం చూపుడు వేలుతో ఆకాశం వైపు చూపిస్తున్నట్టు ఎందుకు ఉంది, అది కూడా ముఖంలో ఒక చిరునవ్వు కూడా ఉంది చూడండి. ఇలాంటి పురాతన బొమ్మ ఇది ఒక్కటి మాత్రమే లేదు. ఇక్కడినుండి 1700 మైళ్ళ దూరంలో, నాజ్కా ఎడారిపై ఈ విధంగా ఒక బొమ్మను గీశారు, ఆ బొమ్మను El astronauta అని చెప్తున్నారు, అంటే ఒక astronaut ఏంచేస్తారో అదే విధంగా ఉంది. చక్విరాలో చూసిన విధంగానే పెద్ద గుండ్రని కళ్ళు మరియు ఆకాశం వైపు చూపిస్తూ ఒక చూపుడు వేలు ఉంది. దీనికి పక్కనే ఉన్న పెరు దేశంలో, నాజ్కా లైన్స్ అనే ప్రాంతంలో, ఇలాంటి రహస్యమైన బొమ్మలు చాలా ఉన్నాయి, planeలో వెళ్ళినప్పుడు మాత్రమే ఈ బొమ్మలను మనం చూడగలము. 
Ancient astronauts అంటే పురాతన వ్యోమగాములు, వేల సంవత్సరాల క్రితం మన గ్రహానికి వచ్చారా? అందుకే, ‘లా చక్విరా’ వంటి చెక్కడాలు మనకు కనిపిస్తున్నాయా? Archeologistలు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనుకోవడం లేదు, అలానే ఈ శిల్పం గురించి వాళ్లకు అస్సలు ఏం తెలీదని ఒప్పుకుంటున్నారు. ఈ శిల్పానికి 'లా చక్విరా' అనే పేరు ఎందుకు వచ్చిందని ఎవరికీ తెలీదు, కానీ కొంతమంది స్థానికులు, దీన్ని ఆకాశం యొక్క దేవుడని, ఉరుములు మరియు మెరుపుల దేవుడని చెప్తున్నారు. ఇందులో ఒక interesting అయిన విషయం ఏంటంటే, ఉరుము మరియు మెరుపులకు దేవుడు అయిన చాక్ అని పిలువబడే మాయన్ దేవుడు మరియు సక్కా అని పిలువబడే ఒక హిందూ దేవుడు ఉన్నాడు, అతను కూడా ఉరుము మరియు వెలుతురుకు దేవుడుగా ప్రసిద్ధి చెందాడు. 
ఇది కేవలం coincidence హా, లేక అందరూ ఒకే దేవుడి గురించి మాట్లాడుతున్నారా? ఈ శిల్పంలో ఇతర features ఏమీలేవు, కాబట్టి దాని గురించి ఇంతకు మించి నేను మరిన్ని వివరాలను చెప్పలేకపోతున్నాను. కానీ దీనికి ముందు, నా మిగతా వీడియోలలో ఒక విషయం చెప్పాను, అది మీకు గుర్తుందా, అది ఏంటంటే, ఒక ప్రాంతంలో ఈ విధంగా seperateగా ఒక చెక్కడాన్ని లేదా ఒక గుహ పెయింటింగ్ ని మీరు చూడలేరు. ఒకే placeలో చాలా చెక్కడాలు, మరియు చాలా గుహ పెయింటింగ్స్ కనిపిస్తాయి. కాబట్టి, నేను ఇదే placeలో ఇలాంటివి మరిన్ని శిల్పాలు ఉన్నాయా లేదా అని మిగతా రాళ్ళలో వెతికి చూసాను, అయినా పెద్దగా ఏం లేదు, కానీ నేను చాలా interesting అయినా ఒక విషయాన్నీ గమనించాను. 
అది ఏంటంటే, ‘లా చక్విరా’ వెనుక ఒక విచిత్రమైన శిల్పం ఉంది. ఈ శిల్పం onlineలో కనిపించడం బహుశా ఇదే మొదటిసారి, ఎందుకంటే నేను googleలో చూసినప్పుడు, లా చక్విరా చెక్కడం తప్ప మరేమి ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ముఖానికి helmet వేసి ఉంది, helmetకి పైన antennaలు పొడుచుకు వచ్చాయి, దాని వేలు ఆకాశం వైపు చూపిస్తున్నట్టుగా ఉంది. దీని ఇతర లక్షణాలేవి స్పష్టంగా లేవు, అయినప్పటికీ ఇది ఆకాశం వైపుకు చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రదేశం గురించి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, కొలంబియాలో రాళ్లపై 2d చెక్కడాలను చెక్కిన ఒకే ఒక పురాతన ప్రదేశం ఇదే, అది కూడా 3d చెక్కడాలకు పూర్తిగా oppositeగా ఉండేవిధంగా ఉన్నాయి.
- Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 1 year
Video
youtube
నరబలి అడుగుతున్న దేవుడా? వేల సంవత్సరాల క్రితం కట్టబడిన పురాతన హిందూ దేవాలయం!
Hey guys, దీనికి ముందు వీడియోలో కొలంబియాలోని శాన్ అగస్టిన్ Archaeological Parkలో హిందూ మతానికి చెందిన అనేక పురాతన విగ్రహాలు ఎలా కనుగొనబడ్డాయని నేను మీకు చూపించాను. ఈ వీడియోలో, వేరే states లో ఉన్న ఇలాంటి శిల్పాలనే నేను మీకు చూపించబోతున్నాను, ఇవన్నీ నిజంగా ఏంటి అని explain చేయబోతున్న్నాను. ఇప్పుడు మనం ఈ విగ్రహాన్ని బాగా పరిశీలిద్దాం. ఇది 10 అడుగుల కంటే ఎక్కువ పొడవుగా ఉంది, దీన్ని ఒక solid ఐన రాయితో rectangular షేప్ లో తయారుచేయబడిన ఒక శిల్పం. 
దాని ముఖాన్ని చూస్తే, నోటిలో కోర పళ్లతో చెక్కబడి, చేతిలో ఒక చిన్న శిశువును పట్టుకొని ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఈ విగ్రహం దేనిని explain చేస్తుంది? Experts ఇది ఏంటని తెలియడం లేదని చెప్తున్నారు, కొంతమంది, దీన్ని ఇది పిల్లలను తినే రాక్షసుడిని సూచిస్తుందని కూడా చెప్తున్నారు. ఈ place లో అనేక విగ్రహాలు కనుగొనబడ్డాయి, అవి చూడడానికి, ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ఇంకా చాలా మంది experts, వేల సంవత్సరాలకు ముందు ఇక్కడ నివసించిన పూర్వ-కొలంబియన్ ప్రజలు, ఈ రాక్షసులను సంతోషపెట్టడానికి పిల్లలను బలి ఇచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. 
Spanish దేశస్థులు కొలంబియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక సంస్కృతి వాళ్లకు అర్ధంకాకా ఈ రకమైన కించపరిచే వివరణలు ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, పిల్లలను తినే రాక్షసులను మానవులు పూజిస్తారా? ఇక్కడ ఏమి జరుగుతుందని నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఈ విగ్రహం పైభాగంలో ఒక ముఖం ఉంది, కింద భాగంలో ఒక ముఖం ఉంది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని తలక్రిందులు చేసి, కింద ఉన్న ముఖాన్ని చూద్దాం. ఈ ముఖం విపరీతమైన నొప్పితో ఉందని స్పష్టంగా వర్ణిస్తుంది. ఎందుకంటే ఈ స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తోంది, అందుకే ప్రసవ నొప్పి కారణంగా ఆమె పళ్ళు కొరుకుతూ, పిడికిలిని వీలైనంత గట్టిగా బిగించికుని ఉంది చూడండి. 
పైన ఉన్న ఈ "రాక్షసుడు" నిజానికి ఒక వైద్యుడు, అతను బిడ్డను ప్రసవించడానికి ఆ స్త్రీకి సహాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా, ఇప్పట్లో ఉన్న డాక్టర్ లాగానే, అతను శిశువును తలక్రిందులుగా పట్టుకుని ఉన్నాడు, ఇది సరైన వైద్య విధానం కూడా. ఇవన్నీ నేను ఎలా కనిపెట్టగలిగాను? ఎందుకంటే ఈ కథలన్నీ ప్రాచీన భారతీయ గ్రంథాలలో స్పష్టంగా నమోదు చేయబడ్డాయి. ఈ దేవుడిని హిందూ మతంలో తాయుమానవర్ అని పిలుస్తారు, అతను మహిళలకు ఆరోగ్యకరమైన శిశువులను ప్రసవించడంలో సహాయం చేస్తారు. అందుకే భారతదేశంలో ఆయనకు అంకితం చేయబడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. 
 ఉదాహరణకు తిరుచ్చి అనే నగరంలో 6వ శతాబ్దంలో ఈయనకు అంకితం చేయబడిన ఒక దేవాలయం ఉంది, మన దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఇప్పటికీ కూడా అనేక ప్లేస్ లలో నుండి వచ్చి normal delivery కోసం ఈ భగవంతుని ఆశీర్వాదం తీస్కుని వెళ్తున్నారు. ఇండియాలో, సాధారణంగా ఈ దేవుడిని తన చేతుల్లో ఒక శిశువును పట్టుకున్నట్లు చూపించారు. ఈయన శివుని యొక్క ఒక అవతారం, దక్షిణ భారతదేశంలో, పురాతన శివుని విగ్రహాలలో అతని క్రూరత్వాన్ని చూపించడానికి కోరలతో ఉన్నట్టు చూపిస్తారు. 1300 సంవత్సరాల పురాతనమైన కైలాసనాథర్ ఆలయాన్ని చూస్తే, అక్కడ ఉన్న అన్ని శివ విగ్రహాలు కోర పళ్లతోనే చిత్రీకరించబడ్డాయి. 
కొలంబియాలోని శాన్ అగస్టిన్ park లో చుట్టుపక్కల చాలా ప్రదేశాలలో ఈ థాయుమానవర్ ని అదే కోరలతో ఉన్నట్టు చెక్కి ఉంచారు. ఈ పురాతన ప్రదేశాన్ని ఎల్ పురుటాల్ అని పిలుస్తారు,  ఇక్కడ ఉన్న ఈ విగ్రహనన్ని చుడండి, ఇప్పటికీ దాని original painting చెక్కుచెదరకుండా అలానే ఉంది. ఈ దేవుని చేతిలో ఒక బిడ్డను పట్టుని కూర పళ్లతో చూడడానికే చాలా ఉగ్రంగా కనిపిస్తున్నాడు. కానీ యూరోపియన్ల ఈ ప్లేస్ ని స్వాధీనం చేసుకుని, ఈ విగ్రహాలను వెలికితీసిన తర్వాత మన కథల గురించి తెలియకుండా, ఇది పిల్లలను తినే రాక్షసుడు అని ఊహించారు. 
ఇంకా ఈ విగ్రహానికి సంబంధించిన కొన్ని వివరాలు చాలా attractiveగా ఉన్నాయి. అనేక పుర్రెలతో చేసిన ఈ కిరీటం ఉంది, ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఎందుకంటే మనం అనేక హిందూ శిల్పాలలో అదే వివరాలను చాలా చోట్ల చూసుంటాము. హొయసలేశ్వర గుడిలో, కొన్ని పుర్రెలలో చిన్న చిన్న రంధ్రాలు ఎలా వేసారో అని నేను మీకు ఆల్రెడీ పాత వీడియోలో చూపించాను.  శాన్ అగస్టిన్‌లో శివుని యొక్క మరొక రూపం కూడా చెక్కబడి ఉంది.ఈ శిల్పాన్ని చూడండి: ఒక చేతిలో తెగిపడిన తలను మరియు మరో చేతిలో కత్తిని పట్టుకుని ఉంది.   
ఇది భైరవ అని పిలువబడే శివుని యొక్క నిర్దిష్ట అవతారం, ఎప్పుడూ భైరవుని కత్తిరించిన తలతో లేదా ఒక పుర్రెను పట్టుకుని ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది, దక్షిణ భారతదేశంలోని పురాతన భైరవ విగ్రహం.  ఒక చేతిలో నరికిన తలను, మరో చేతిలో కత్తిని చూడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే, శివుడు ఒక పుర్రె హారాన్ని వేసుకున్నట్టు మీరు చూడవచ్చు. ఇది కూడా దక్షిణ భారతదేశానికి చెందిన మరొక భైరవ విగ్రహం, అతని ఖడ్గం విరిగిపోయింది, కానీ అతను కత్తిరించిన తలని పట్టుకుని, పుర్రెల హారాన్ని వేసుకుని నోటిలో కోరపళ్లతో ఆగ్రహంగా ఉండడం మీరు స్పష్టంగా చూడవచ్చు. భైరవుని ఆరాధనలు నేపాల్‌ వరకు వెళ్ళినప్పుడు, ఆయన అంశాలు ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి. భైరవుడు మరింత ఉగ్రంగా కనిపిస్తున్నాడు, ఆయన మళ్ళీ ఒక చేతిలో కత్తిని, ఇంకొక చేతిలో చాలా తలలు పట్టుకుని ఇంకా పుర్రె మాలలతో ఉన్నాడు.
- Praveen Mohan Telugu 
1 note · View note
praveenmohantelugu · 1 year
Video
youtube
కొలంబియాలో పురాతన హిందూ దేవాలయం కనుగొనబడింది? మన నిజమైన చరిత్ర కొలంబియాలో దాగి ఉంది!
Hey guys, ఈ రోజు నేను మీకు చాలా మర్మమైన ఒక పురాతన స్థలాన్ని చూపించబోతున్నాను, ఇది South Americaలో కొలంబియా అనే దేశంలో San Agustin అనే cityలో ఉంది. India నుండి వచ్చిన హిందువులే దీన్ని కట్టారని నేను మీకు కొన్ని బలమైన ఆధారాలను చూపబోతున్నాను. అవును, India నుండి కొలంబియా కి దాదాపు 11,000 మైళ్ల దూరంలో ఉంది. So మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి, ఈ సైట్ హిందువుల వల్ల కట్టబడిందా లేదా అని నిర్ణయించుకుంటారని నేను ఆశిస్తున్నాను. 
ఈ సైట్‌లోని ఈ విగ్రహాన్ని చూడండి, ఇక్కడ ఒక డేగ లాంటి పక్షి దాని ముక్కులో పామును పట్టుకున్నట్లు మీరు చూడవచ్చు ఇంకా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ పామును పక్షి గోళ్లతో కూడా పట్టుకున్నట్లు చూడవచ్చు. ఇక్కడ ఎందుకు ఇలాంటి విగ్రహాన్ని చెక్కారని కొలంబియాలో ఉన్న archeologist వల్ల వివరించలేకపోయినప్పటికీ, మన హిందూ గ్రంధాలు మరియు హిందూ వేదాలలో వీటి గురించి స్పష్టంగా వివరించారు. నాగ సర్పంతో శాశ్వత శత్రుత్వం ఉన్న ఈ పక్షిని గరుడ అని పిలుస్తారు. 
నేను మీకు హిందూ గుడుల నుండి ఇలాంటి అనేక శిల్పాలను చూపించాలనుకుంటున్నాను. భారతదేశంలోని దేవాలయాలలో, గరుడ మరియు నాగ చెక్కడాలను సగం మనిషిగానే చూపించారు.  అయితే, హిందూమతం భారతదేశం నుండి south east Asia వరకు వ్యాపించడంతో, వాటి style కూడా నెమ్మదిగా మారడం ప్రారంభించింది. Vietnam కి వచ్చిన తర్వాత ఆ style ఏం జరిగిందో చూడండి. ఈ scene లో 2 జంతువుల మధ్య జరిగే పోరాటాన్ని చూపించారు. 
అయినా వాళ్ళు హిందూ దేవుళ్ళు లాగా కనిపించడం లేదు. ఈ పామును దాని ముక్కుతో గోళ్లలో పట్టుకున్న పక్షిలా కనిపిస్తోంది. ఈ 2 విగ్రహాల మధ్య ఉ��్న similarityను చూడండి. ఇది కేవలం coincidenceగా జరిగినట్టు ఉందా? లేదంటే హిందువులు కొలంబియాకి వెళ్లి ఇక్కడ స్థలం ఏర్పాటు చేసుకుని శిల్పాలు చెక్కారు? ఈ విగ్రహానికి సంబంధించిన ఏ ఒక్క సరైన వివరణ Archaeologist దగ్గర లేదు. ఒక డేగ పామును పట్టుకోవడం శిల్పి చూసుంటారు, దానిని విగ్రహంగా చెక్కారని ఇక్కడున్న ప్రజలు నమ్ముతున్నారు. 
అలా జరగడానికి సాధ్యమేనా?లేదు, ఎందుకంటే అలా జరుగుంటే ఇక్కడ ఇలంటి ఒకే ఒక విగ్రహాన్ని మాత్రమే మనం చూసుంటాము, కానీ ఈ ప్రాంతంలో అదేలాంటి అనేక విగ్రహాలు బయటపడ్డాయి. దీని అర్థం ఏంటంటే, ఈ విగ్రహాన్నిసృష్టించిన సృష్టికర్తలకు ఇది చాలా ముఖ్యమైనదిగా ఉండుంటుంది, దీనికి కొంత లోతైన అర్ధం ఉంటుంది. అదే similarity తో ఉన్న విగ్రహం ఇక్కడ ఉంది, దీన్ని కొలంబియాలో ఎల్ పురుటల్ అని పిలువబడే వేరొక ప్రదేశంలో కనిపెట్టారు. ఇది ఖచ్చితమైన అదే featureలను చూపుతుంది, ఒక పక్షి దాని ముక్కుతో, గోళ్లలో పామును పట్టుకుని ఉంది. 
ఈ ప్రాంతంలో ఇలాంటి అనేక విగ్రహాలను మనం చూడగలుగుతున్నాము, వాస్తవానికి శాన్ అగస్టిన్ ఈ విగ్రహాన్ని తన unofficial symbolగా ఉపయోగిస్తుంది, ఇంకా దాని అసలు అర్థం తెలుసోకుండా దీన్ని అనేక మెమెంటోస్ గా కూడా అమ్ముతున్నారు. అయితే భారతదేశం నుండి కొలంబియా వరకు హిందువులు ఎలా రాగలిగారు? ఎలా వచ్చారని నేను మీకు చెప్తాను, అయితే దానికి ముందు ఈ పురాతన విగ్రహాన్ని చూద్దాం, దీన్ని కూడా శాన్ అగస్టిన్‌లోనే కనిపెట్టారు, దీన్ని మీరు చూసిన వెంటనే, నిజంగా ఏదో విచిత్రమైనది ఉందని మీకు తెలుస్తుంది.
ఇతనికి మానవ శరీరం, మానవ చేతులు ఉన్నాయి, కానీ ఏనుగు తొండం ఉంది. ఈ తొండం పై నుండి కింది వరకు ఎలా వెళ్తుందో చూడండి, అతనికి మనిషి ముక్కు లేదు, ఏనుగు తొండం ఉంది, ఏనుగుకు ఉన్న విధంగా చిన్న కళ్ళు ఉన్నాయి. దీని గురించి కూడా archaeologistsల దగ్గర నిజమైన వివరణ లేదు, కానీ ఇది మరెవరో కాదు మన హిందూ దేవుడైన మనం వినాయకుడు. అతను మానవ శరీరంతో ఏనుగు ముఖంతో ఉన్న ఒక దేవుణ్ణి స్పష్టంగా చిత్రీకరించారు. వీటి similarity ని చూడండి, సందేహమే లేదు, ఇది మన హిందూ దేవుడైన వినాయకుడు అని. 
ఈ రెండు విగ్రహాలలో తమ చేతులతో వాళ్ళ ట్రంక్‌లను తాకడం మనం చూడవచ్చు, ఇంకా వాళ్ళ తలపై హెల్మెట్‌లు లాంటి కిరీటం కూడా ఉండటం మనం చూడవచ్చు. అయితే ఇది నిజంగా హిందూ దేవుడు వినాయకుడా? లేదంటే ప్రపంచంలో ఉన్న సంప్రదాయాలన్నీ హిందూ మతం నుండే వచ్చింది భారతదేశం నుండే వచ్చింది అనే normal అయిన విషయాలనే నేను కూడా చేస్తున్నానా? Indian అయితే షేర్ చేయండి, హిందూ వాళ్లయితే షేర్ చేయండి అని చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నానా? 
మీరు దీన్ని ఏ దేశం నుండి చూసినా, మనమందరం ఇలాంటి వ్యక్తిని చుసుంటాము, తన మతమే గొప్ప లేదా తన దేశమే గొప్ప అని ఇంకా ప్రపంచ నాగరికత మా నుండే ఉద్భవించిందని నమ్మే వాళ్ళను మనం చూసుంటాము. మీరు నా ఇంగ్లీష్ ఛానెల్‌ని చూశారంటే, నేను ఇంతకు ముందు భారతదేశం నుండి వెలుపల ఉన్న చాలా పురాతన ప్రదేశాలను చూపించాను. నేను South Americaలో ఉన్న పెరూను చూపించాను, US లో ఉన్న అనేక పురాతన ప్రదేశాలను కూడా నేను చూపించాను, కానీ అవన్నీ హిందూ మతానికి సంబంధించిన సైట్లు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. 
ఏఒక్క విషయంలోనూ నా religion, caste, language ను base చేసుకొని analyze చేయకూడదని నేను చాలా try చేస్తాను. ఐతే నేను ఒక్కడినే నా, ఇతను హిందువుల దేవుడైన వినాయకుడు అని అనుకుంటున్నాను? ఈ కొలంబియా లో ఒక shopkeeper దగ్గర నేను మాట్లాడాను చుడండి. ఇప్పడు చూపిస్తున్న ఈ వీడియో ఎందుకంటే, ప్రవీణ్ మోహన్ అబద్ధం చెప్తున్నాడు అని చెప్పే వాళ్లకు మాత్రమే. మీరే చూసారు కదా, స్థానిక కొలంబియన్ కూడా ఇది హిందూ దేవుడుగా ఉన్న వినాయకుడు అని ఒప్పుకుంటున్నాడు,  ఇంకా చాలా మంది కొలంబియన్లు కూడా ఇలా అనుకుంటూ ఉన్నారు. ఎందుకు?
- Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 1 year
Video
youtube
మాయాసురుడు నిర్మించిన అతీంద్రియ దేవాలయం! ఇది పురాతన ఏలియన్స్ టెక్నాలజీతో నిర్మించబడిందా?
Hey guys, ఈ రోజు నేను ఛత్తీస్గర్హ్ జిల్లాలో ఉన్న సురంగ్ టీల అనే గుడిలో ఉన్నాను, ఇది 1300 సంవత్సరాల పురాతనమైనది, ఈ గుడి యొక్క అందం ఏంటంటే, ఇది earthquake-resistant అంటే ఈ గుడిని నిర్మించడానికి భూకంప నిరోధక నిర్మాణాన్ని ఉపయోగించి నిర్మించారు. ఇక్కడ ఈ మెట్లన్నీ ఎలా వంగి ఉన్నాయో చూడండి, 11వ శతాబ్దంలో సంభవించిన ఒక పెద్ద భూకంపం యొక్క ప్రభావమే ఇది. 
ఆ భూకంపం, ఈ ప్రాంతంలో ఉన్న మిగతా నిర్మాణాలన్నీ పూర్తిగా నాశనం చేసింది, కానీ ఈ గుడి యొక్క మెట్లను మాత్రమే వంచగలిగింది, ఈ గుడి నిర్మాణాన్ని ధ్వంసం చేయలేకపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న మిగతావన్నీటిని నేలమట్టం చేసిన, ఆ శక్తివంతమైన భూకంపాన్ని ఈ గుడి ఎలా తట్టుకోగలిగింది? 1300 సంవత్సరాలకు ముందు ఎలాంటి construction technologyని ఉపయోగించి ఈ గుడిని కట్టారు? 
మీరు నమ్ముతారో లేదో కానీ 4500 సంవత్సరాలకు ముందు రాసిన మాయమఠం అని పిలవబడే పురాతన గ్రంథంలో, నిర్మాణ దారులు, ఈ గుడిని కట్టడానికి ఉపయోగించిన విచిత్రమైన construction technique గురించి clearగా చెప్పారు. ఈ గుడిలో అనేక vertical shafts ఉన్నాయి, అవి దాదాపు 75 అడుగుల పొడవుతో భూమికి లోపలికి ఉన్నాయి, ఇవి కింది భాగంలో గాలి vacuumని  సృష్టిస్తాయి. ఈ గాలి కారణంగానే ఇంత పెద్ద భూకంపాన్ని కూడా ఈ గుడి తట్టుకోగలిగింది, ఎందుకంటే ఈ air pockets ఉన్నాయి కదా, అవి భూకంపం యొక్క vibrationsలను గ్రహించి, చెదిరిపోయేలా చేస్తున్నాయి. 
ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక విచిత్రమైన జిగురును ఉపయోగించే ఈ రాళ్లను attach చేశారు. ఆ పురాతన పుస్తకంలో చెప్పిన విధంగానే, ఈ పెద్ద రాళ్లను, ఒక ప్రత్యేక రకమైన మిశ్రమంతో కలిపి ఒకటి చేశారు. ఈ paste, కాంక్రీట్ కంటే చాలా రెట్లు బలంగా ఉండడమే కాకుండా నిర్మాణం శాశ్వతంగా నిలిపోయేటట్టు ఇది పనిచేస్తుంది. So, 4500 సంవత్సరాలకు ముందు, ఈ భూకంప నిరోధక సాంకేతికతను ఎలా సృష్టించారు? 
ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ పుస్తకాన్ని రచించింది మాయాసుర, అతnu గ్రహాంతరవాసుల జాతి అయిన అసురులకు నాయకుడిగా ఉన్నాడు. ఇతనే, చాలా అద్భుతమైన megalithic structure అంటే రాయితో తయారు చేసిన గుడులన్నిటికి వాస్తుశిల్పి అంటే architect, దీన్నే మన పురాతన భారతీయ గ్రంథాలలో పదే పదే చెప్తున్నారు. 2006 లో government archeologist అయినా, డాక్టర్ అరుణ్ శర్మ ఈ గుడిని త్రవ్వించారు, అలానే ప్రాచీన భారతీయ గ్రంథాలలో ఉన్న mapలను అనుసరించి అనేక గుడులను వెలికితీశారు. 
ఈ నిర్మాణాన్ని గ్రహాంతరవాసులు నిర్మించారని బహిరంగంగా చెప్పిన మొట్టమొదటి government archeologistలలో డాక్టర్ శర్మ ఒకరు. ఈ earthquake proof technology మాత్రమే దీనికి కారణం కాదు, ఈ గుడి కింది భాగంలో ఆయన కనిపెట్టిన ఒక విషయం కూడా ఒక కారణం. ఈ గుడి కింద మనుషుల్లాగా కనిపించని ఎన్నో వింత బొమ్మలను ఆయన కనిపెట్టారు. అవన్నీ బూడిద గ్రహాంతరవాసుల వర్ణనలాగ కనిపిస్తున్నాయి. అలానే కొన్ని వాటిలో కంటి అద్దాలు వేసుకున్నట్లు మరియు ఇంకొన్ని వాటిలో helmetలు వేసుకున్నట్లు కూడా చూపించారు. 
ఒక గ్రహాంతరవాసి లాగానే ఉన్న ఒక పెద్ద mask కూడా కనిపెట్టారు, పక్కనే ఉన్న museumలో దాన్ని ఇంతకు పెట్టారు, కానీ ఇప్పుడు దాన్ని తీసేసారు ఎందుకని కారణం తెలీదు. ఒకవేళ ఈ భూకంపాన్ని, తట్టుకునే technologyని చేసిన, గ్రహాంతరవాసి, మాయాసురుడినే, ఈ బొమ్మలు సూచిస్తున్నాయా? అది సాధ్యమేనా? ఇది నిజమైతే, అసురులందరూ నిజంగానే వేరే గ్రహం నుండి వచ్చిన astronauts లేనా? జులై 2014 లో, ఈ గుడి నుండి, కేవలం 200 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో, ఒక archeologist ఇదే విధమైన బొమ్మలను కనిపెట్టారు.
 తలకు హెల్మెట్‌లు మరియు antennaలతో ఉన్న గ్రహాంతరవాసులను చూపించే rock paintingలను అతను కనిపెట్టాడు. And ఈ paintings అన్ని గ్రహాంతరవాసులను మాత్రమే కాకుండా, వాళ్ళ flying craftను కూడా చూపిస్తున్నాయి.  కొంతమంది archologistలు కూడా, ఈ paintings అన్ని గ్రహాంతరవాసులను వర్ణిస్తున్నాయని చెప్తున్నారు. పురాతన గ్రహాంతరవాసులు గతంలో మనలను సందర్శించారు అనడానికి, ఈ ఆధారాలన్నీ సూచించడం అనేది coincidenceహా? 
సురంగ్ టీల గుడిని alien technologyతో నిర్మించారా? మరి ఎలా భూకంపాన్ని తట్టుకునేలా ఈ గుడిని కట్టారు? హెల్మెట్‌లతో ఉన్న ఈ వింత ముఖ బొమ్మలను గుడి కింద ఎందుకు పాతిపెట్టారు? ఈ గ్రహాంతవాసుల ముఖాలు మరియు ఎగిరే క్రాఫ్ట్‌లతో కూడిన ఈ గుహ చిత్రాలను అదే ప్రాంతంలో ఎందుకు చూస్తున్నాము?
- Praveen Mohan Telugu
1 note · View note
mindofatraveler · 3 years
Photo
Tumblr media
Lost in Vietnam. A truly breathtaking experience was finding this amazing temple carved in stone. The time of the day was perfect and the sun aligned with the cave ceiling opening letting the light pass through as a mesmerized golden waterfall. Only for few minutes, the sun rays showed us an ancient path from the cave entrance to the temple one. . . . . . #mindofatraveler_ #vietnam #lostinvietnam #vietnamadventures #nhatrang #hiddencave #hiddentemple #ancienttemple #stonecarvedtemple #carvedtemple #ancientconstruction #ancientsecret #losttemple #lostsecret #buddhismtemple #asiantemple #indianajonesadventure #indianajones #traveldiary #traveladventures #adventurephotography #lostcivilization #forgottenhistory #breathtaking_snaps #breathtaking #breathtakingtemple (at Nha Trang) https://www.instagram.com/p/CLi-zClA-2H/?igshid=1oix5to6zkmbr
0 notes
just-a-toy-kid · 3 years
Photo
Tumblr media
@toyfinity The Ancient Construct known as En'Kai, Singer of Galaxies! #onelldesign #glyos #glyossystem #toyfinity #zeroids #toyphotography #glyoscompatible #roboforce #zeroidzobor #zeroid #zobor #starteam #zintar #neozeroid #ancientconstruct #modulartoys #maxxzero #maxxzeroid https://www.instagram.com/p/CLptP8ggtEC/?igshid=z04dc0oj5j27
0 notes
just-a-toy-kid · 3 years
Photo
Tumblr media
@toyfinity @nistuff @onelldesign The Outlander visits the Ancient Construct known as Ur'reem the Revelator! #onelldesign #glyos #glyossystem #toyfinity #zeroids #toyphotography #glyoscompatible #roboforce #zeroidzobor #zeroid #zobor #starteam #zintar #neozeroid #ancientconstruct #modulartoys #maxxzero #maxxzeroid #onelldesign #nistuff #481universe #nistuffoutlander #glyosoutlander #outlander  https://www.instagram.com/p/CLfS-cjAIKR/?igshid=zafw7isrwzcm
0 notes
just-a-toy-kid · 3 years
Photo
Tumblr media
The Ancient Construct known as Ur'reem the Revelator! #onelldesign #glyos #glyossystem #toyfinity #zeroids #toyphotography #glyoscompatible #roboforce #zeroidzobor #zeroid #zobor #starteam #zintar #neozeroid #ancientconstruct #modulartoys #maxxzero #maxxzeroid https://www.instagram.com/p/CLfQs5jA7t8/?igshid=1ia86ivdvbegu
0 notes
just-a-toy-kid · 5 years
Photo
Tumblr media
Been tweaking the Original Construct. @toyfinity @onelldesign @spacedoutdesign From It's lore: "The Original Construct arrives! Older than the Glyoverse itself, legends say that this nameless entity constructed itself from the nothingness of the Void!" #onelldesign #glyos #glyossystem #toyfinity #zeroids #toyphotography #glyoscompatible #roboforce #zeroidzobor #zeroid #zobor #starteam #zintar #neozeroid #ancientconstruct #modulartoys #maxxzero #maxxzeroid #spacedoutdesign #geodraxus #prismiria https://www.instagram.com/p/B5JGJ3NgBlf/?igshid=19y2rxt6pzsxs
0 notes
just-a-toy-kid · 5 years
Photo
Tumblr media
Been tweaking the Original Construct. @toyfinity @onelldesign @spacedoutdesign From It's lore: "The Original Construct arrives! Older than the Glyoverse itself, legends say that this nameless entity constructed itself from the nothingness of the Void!" #onelldesign #glyos #glyossystem #toyfinity #zeroids #toyphotography #glyoscompatible #roboforce #zeroidzobor #zeroid #zobor #starteam #zintar #neozeroid #ancientconstruct #modulartoys #maxxzero #maxxzeroid #spacedoutdesign #geodraxus #prismiria https://www.instagram.com/p/B5JGGXIgRv3/?igshid=inqap5i9etkv
0 notes
just-a-toy-kid · 5 years
Photo
Tumblr media
Been tweaking the Original Construct. @toyfinity @onelldesign @spacedoutdesign From It's lore: "The Original Construct arrives! Older than the Glyoverse itself, legends say that this nameless entity constructed itself from the nothingness of the Void!" #onelldesign #glyos #glyossystem #toyfinity #zeroids #toyphotography #glyoscompatible #roboforce #zeroidzobor #zeroid #zobor #starteam #zintar #neozeroid #ancientconstruct #modulartoys #maxxzero #maxxzeroid #spacedoutdesign #geodraxus #prismiria https://www.instagram.com/p/B5JGC52AB7Y/?igshid=cf3ejx9z4ndo
0 notes